గుంటూరు సమీపంలో వెంగలాయపురంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు గుంటూరు ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో గోపి మరియు నాగేశ్వరావు ఇద్దరూ వ్యక్తులు డబ్బు సంపాదించేందుకు సులువైన మార్గంగా గంజాయిని విక్రయిస్తున్నట్లు గుంటూరు ఎక్సైజ్ సిఐ తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో వారి వద్ద నుంచి ఒకటిన్నర కిలోల గంజాయి లభించినట్లు వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.