ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గెయిల్, అంబికా సంస్థలకు గతంలో ఉన్న భూ కేటాయింపులను రద్దు చేసింది. 6 సంస్థలకు ఇచ్చిన భూములపై సవరణలు చేసి మళ్లీ కేటాయించడంతోపాటు కొత్తగా 7 సంస్థలకు 32. 4 ఎకరాలు 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. భాజపా కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.