వేటపాలెం: విద్యార్థులకు ట్రై సైకిళ్లు అందజేత

వేటపాలెంలోని భవిత కేంద్రం నందు సోమవారం ఇద్దరు విద్యార్థులకు ట్రై సైకిళ్లు మరియు వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుబ్బయ్య పాల్గొని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. దీనిలో భాగంగానే ట్రై సైకిళ్లను అందజేసిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్