గుంటూరు కొత్తపేటలో వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లు వాడుతున్న హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక టిఫిన్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 3 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించారు. ఈ ఉదంతంపై జాయింట్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.