CM, DCM, మంత్రిపై అసభ్య పోస్టులు: యువకుడి అరెస్ట్

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ పై 2025లో అసభ్యకరంగా పోస్టులు చేసిన పొంగనూరు సురేశ్ అనే యువకుడిని పాతగుంటూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం, కడప జిల్లా బద్వేల్ మండలం రామాంజనేయ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడు అప్పట్లో ముగ్గురిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టాడని, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతన్ని పట్టుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్