రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులతో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు బుధవారం సమావేశమయ్యారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై చర్చించారు. రైతుల అభిప్రాయాలను విన్న మంత్రి, వారి విజ్ఞప్తి మేరకు ప్లాట్లు కేటాయించాలంటూ అధికారులకు ఆదేశించారు.