పలు రైళ్లకు అదనంగా మూడో తరగతి ఏసీ బోగీ ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కాచి గూడ మధ్య నడిచే రైలు (17251)కు సెప్టెంబరు 29 నుంచి, తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17252)కు సెప్టెంబరు 30 నుంచి, గుంటూరు-రాయగడ(17243)కు అక్టోబరు 1 నుంచి, తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17244)కు అక్టోబరు 2వ తేదీ నుంచి అదనంగా 3వ తరగతి ఏసీ బోగీని ఏర్పాటు చేయనున్నారు.