ఇనుప రాడ్డుతో దాడి ఘటనపై ఆదివారం సాయంత్రం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రామకృష్ణ వడ్డెరకాలనీలో సిమెంట్ వ్యాపారం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ సిమెంట్ దుకాణం పెట్టవద్దని స్థానికులు నిరసన తెలిపారు. వారికి సర్దిచెప్పే క్రమంలో అంకమ్మ అనే వ్యక్తి ఇనప రాడ్డుతో రామకృష్ణపై దాడి చేశారన్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాంబాబు తెలిపారు.