గుంటూరు: ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

జేకేసీ కళాశాల రోడ్డుకు చెందిన ఒక మహిళ ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తి మార్ఫింగ్ చేసి, ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ, తన పరువుకు భంగం కలిగించిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టాభిపురం ఠాణాలో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్