రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్నామని, స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఏపీకి రాబోతున్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌పై దృష్టి పెట్టామని, 20 లక్షల ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులు వైసీపీ కంటే ఎక్కువని పేర్కొన్నారు.