గుంటూరు: కూటమి ప్రభుత్వ వేధిస్తోంది: అంబటి

మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆరోపించారు. సత్తెనపల్లిలో తనకున్న 22 ఎకరాల పొలాన్ని సర్వే చేయాలంటూ ఎమ్మార్వో కార్యాలయం నుంచి నోటీసులు అందాయని తెలిపారు. పొలంలో ఉన్న స్విమ్మింగ్ పూల్, గెస్ట్హౌస్ను సాకుగా చూపి తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన వద్ద దాపరికాలు లేవని, చంద్రబాబు, లోకేశ్ వచ్చి తన పొలాన్ని చూసుకోవచ్చని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్