గుంటూరులోని రాజీవ్ గాంధీనగర్ కు చెందిన మణియమ్మ (65) మతి స్థిమితం సరిగా లేదని, జులై 30 బయటకు వెళ్లిన మణియమ్మ తిరిగి రాలేదని, ఎంత వెతికినా అప్పటినుంచి నుంచి కనిపించడం లేదని కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై అరండల్ పేట పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.