ప్రతి విద్యార్థి ఒక ప్రాణరక్షకుడుగా తయారు అవ్వాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి తెలిపారు. శుక్రవారం చంద్రమౌళి నగర్ మెయిన్ క్యాంపస్ నందు విద్యార్థులకు సిపిఆర్ గురించి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మారిన జీవనశైలిలో కార్డియాక్ అరెస్ట్ ఏ వయసులోనైనా రావచ్చు, ప్రాథమిక ప్రథమచికిత్స తెలిసి ఉండటం తప్పనిసరి అని, ప్రతి విద్యార్థి సిపిఆర్ నేర్చుకోవాలని అన్నారు.