మాజీ సీఎం జగన్ పర్యటనలో అనుమతికి మించి కార్యకర్తలు పాల్గొనడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా వీటిపై మాజీ మంత్రి అంబటి స్పందించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే వారందరి పని చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత చాలా మంది ఐఏఎస్, ఏపీఎస్ లపై కేసులు నమోదు అయ్యాయని అంబటి గుర్తు చేశారు.