ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలనేదే NDA కూటమి ప్రభుత్వ లక్ష్యం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శుక్రవారం 52వ డివిజన్ చంద్రయ్యనగర్ లో సామాజిక పెన్షన్లు పంపిణీలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసి, వారితో ముచ్చటించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు పెంపుతో తమకు జీవితానికి భరోసా ఇచ్చినట్లు ఉందని వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు.