చంద్రమౌళీనగర్ కు చెందిన రాము, రామలక్ష్మి దంపతుల మధ్య గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో, సాయిబాబారోడ్డులో పనికి వెళ్లి వస్తున్న రామలక్ష్మిపై భర్త రాము కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై గాయాలపాలైన రామలక్ష్మి పట్టాభిపురం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయడంతో, భర్త రాముపై కేసు నమోదైంది.