గుంటూరు: వడ్డీ వివాదం.. దంపతులపై దాడి, కేసు నమోదు

గుంటూరులో అప్పుగా తీసుకున్న డబ్బుకు మూడు నెలలుగా వడ్డీ చెల్లించలేదన్న కారణంతో రాజనాల శ్రీనివాసరావు దంపతులపై వంశీకృష్ణ దాడి చేశాడు. భారత్‌పేటకు చెందిన శ్రీనివాసరావు దంపతుల ఫిర్యాదు మేరకు, బ్రాడీపేటకు చెందిన వంశీకృష్ణ అసభ్య పదజాలంతో దూషించి, వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన దంపతులు చికిత్స పొందుతున్నారు. అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్