గుంటూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గట్టి నిఘా అవసరమని, ముఖ్యంగా రవాణా వ్యవస్థ, విద్యా సంస్థలపై దృష్టి సారించాలని సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్ లు ఏర్పాటు చేసి, ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు.