తన పర్యటనలకు భద్రత, అనుమతులు ఇవ్వట్లేదని మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలను మంత్రి లోకేశ్ ఖండించారు. "భద్రత ఇవ్వలేకపోతే అనుమతులివ్వలేదు అంటున్నారు. భద్రత ఇస్తే అడ్డుకుంటున్నారంటున్నారు. నిజానికి జగన్‌కు సీఎం చంద్రబాబుకంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నాం. పోలీసుల్లేకుండా ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది?" అని ప్రశ్నించారు.