గుంటూరులో బ్రాడీపేట 3వ లైన్లోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. జేసీ భార్గవ్ తేజ శంకరన్ జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన అభ్యర్థులు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 వరకు జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.