గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 6 మిల్లీమీటర్లు వర్షంపడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో మిల్లీమీటరు వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నా యి. గుంటూరు పశ్చిమలో 3. 2 మి. మీ. , తాడికొండ 3. 2, దుగ్గిరాల 2. 8, గుంటూరు తూర్పు 2. 4, తుళ్లూరు మండలంలో 2. 2 మి. మీ చొప్పున వర్షం పడింది.