నీట్ ఫలితాల్లో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను ఐటీ మంత్రి లోకేష్ అభినందించారు. నీట్ ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన కార్తీక్ రామ్ కిరీటిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జేఈఈ అడ్వాన్స్ లో ర్యాంకులు సాధించిన యశ్వంత్, ప్రణీత్‌లను వారి తల్లిదండ్రులతో కలిసి అభినందించారు.