గుంటూరులోని 38వ డివిజన్ గుజ్జనగుంట్ల ఎస్సీ కాలనీలో శుక్రవారం నాడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి స్వయంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుండి సలహాలు సూచనలు మాధవి స్వీకరించారు.