గుంటూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం 52వ డివిజన్ చంద్రయ్య నగర్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాధవి పాల్గొని, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల పెంపుతో తమకు జీవితానికి భరోసా ఇచ్చినట్లు ఉన్నదని వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్