గుంటూరు నగరపాలక సంస్థలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో శంకర్ విలాస్ ఫ్లై ఓవర్, PVK నాయుడు మార్కెట్, నార్ల ఆడిటోరియం అభివృద్ధి, ఇన్నర్ రింగ్ రోడ్ విస్తరణ, పారిశుధ్య, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం పాట్ హోల్స్ వాహనాన్ని ఎమ్మెల్యే గల్ల మాధవి ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.