గుంటూరులోని అరండల్పేట యోగి భవన్లో గురువారం లఘు ఉద్యోగ భారతి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సంఘటనా కార్యదర్శి ప్రకాష్ చంద్ర హాజరై నూతన కమిటీని ప్రకటించి, మార్గనిర్దేశం చేశారు. దేశాభివృద్ధికి చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు కృషి చేయాలని కోరారు. చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపై లఘు ఉద్యోగ భారతి జాతీయ స్థాయిలో పోరాడుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.