ద్విచక్ర వాహనం ఢీకొని ఆర్ఎంపీ వైద్యుడికి గాయాలైన ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగన్నాథరావు కొత్తపేటలో ఆర్ ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. సాయిరాం థియేటర్ సమీపంలో వేచి ఉండగా చిట్టినగర్ వైపు వెళ్లే ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడి కుడికాలు విరగగా, ఎడమకాలు, పలు చోట్ల గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితుడు కొత్తపేట పోలీసులకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.