మిర్చి యార్డ్ సమీపంలోని సుభాని హోటల్ నిర్వాహకులు షేక్ ఖాసిం, షేక్ షరీఫ్, అల్లం కాళ్లతో తొక్కిన వైరల్ ఘటనకు తమ హోటల్కు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఆ ఘటన ఐటీసీ ఎదురు ఉన్న శ్రీ శుభం హోటల్‌లో జరిగిందని తెలిపారు. కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయవాడ, వైజాగ్‌లో మాత్రమే తమ బ్రాంచ్‌లు ఉన్నాయని, తెనాలిలో “గుంటూరు సుభాని” పేరుతో ఉన్న హోటల్‌కు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.