గుంటూరు: 14 అంగన్వాడీ కేంద్రాల వర్గోన్నతి

జిల్లాలో 14 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడానికి జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ఆమోదం తెలిపింది. కలెక్టరేట్లో పాలనాధికారి ఎ. తమీమ్ అన్సారియా అధ్యక్షతన మంగళవారం జరిగిన డీఎస్సీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ సహాయకుల నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి పి. పి. జి. ప్రసూన, డీఈవో సి. వి. రేణుక, డీఎంహెచ్్వ విజయలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్టుల సీడీపీవోలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్