గుంటూరు: కలెక్టరేట్ వద్ద వైసీపీ నిరసన

గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ధర్నా నిర్వహించాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీని "దగా డీఎస్సీ"గా అభివర్ణిస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించాయి. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా గుంటూరులో ఈ ధర్నా జరిగింది.

సంబంధిత పోస్ట్