గుంటూరు: బంగారు ఆభరణాలు తీసుకొని ప్రియుడితో ఉడాయించిన యువతి

మల్లికార్జునపేటలో నివసిస్తున్న ఓ యువతి, ఇంట్లో ఉన్న 32 గ్రాముల బంగారు ఆభరణాలు, గొలుసు, ఉంగరం, చెవి దుద్దులు తీసుకొని తన ప్రియుడితో కొద్ది నెలల క్రితం వెళ్లిపోయింది. ఇటీవల తిరిగి ఇంటికి వచ్చి, తన మెడలో ఉన్న 28 గ్రాముల నానుతాడును కూడా లాక్కొని మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయినట్లు ఆమె తల్లి అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్