శలపాడు గ్రామంలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

చేబ్రోలు మండల పరిధిలోని శలపాడు గ్రామంలోని శ్రీ సాయి బాబా వారి దేవాలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఆధ్యాత్మికంగా జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీ మెట్ట సురేష్ బాబు నేతృత్వంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సుమారు 700 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు అందరూ కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్