ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. తొలుత ఏప్రిల్ 27 వరకు గడువు ఉండగా, ఇది చివరి అవకాశమని, సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 30 తర్వాత గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ కళాశాలల్లో నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్