ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ వారంలోనే: లక్షలాది మంది విద్యార్థులకు ఊరట

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ వారంలోనే, జూన్ 15 నుంచి 18 తేదీల మధ్య ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జరిగిన పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. ప్రాక్టికల్ పరీక్షలు కూడా జూన్ 7 నుంచి 11 వరకు నిర్వహించి, వాటి మూల్యాంకనం కూడా పూర్తి చేశారు. ఈసారి తొలిసారిగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించారు. దాదాపు 1.50 లక్షల మంది విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల తర్వాత ఈఏపీసెట్ ఫలితాలు కూడా ఈ వారంలోనే విడుదల కానున్నాయి, ఎందుకంటే ఈఏపీసెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది.

సంబంధిత పోస్ట్