వేపచెట్టు కూలి వ్యక్తి మృతి

గుంటూరు మెడికల్ కళాశాల సమీపంలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో భారీ వేపచెట్టు బైక్‌పై కూలడంతో నగరంపాలేనికి చెందిన సాయికృష్ణ ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. మంగళగిరిలో సీడీపీవోగా పనిచేస్తున్న ఆయన భార్య సరితను రైల్వే స్టేషన్‌లో దించేందుకు కుమారుడితో కలిసి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యకు స్వల్ప గాయాలవ్వగా, ఎనిమిదేళ్ల కుమారుడు కార్తీక్ కాలు విరిగింది.

సంబంధిత పోస్ట్