ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా విభాగం పీజీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జనవరిలో జరిగిన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ రామచంద్రన్ ప్రకటించారు. రీవాల్యుయేషన్ కోరుకునే అభ్యర్థులు ఈ నెల 23లోగా ఒక్కో పేపరుకు రూ.1400 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.