పట్టాభిపురం: ఒకేసారి 80 మాత్రలు మింగి యువకుడు మృతి

పట్టాభిపురంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన 22ఏళ్ల దుర్గారావు మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోజూ మందులు వేసుకుంటూ ఉండేవాడు. కూలి పనిలో తోటి కార్మికులు ఎగతాళి చేయడంతో మందులు మానేశాడు. తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై ఒకేసారి 80 మాత్రలు వేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్