గుంటూరు: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఆర్పిఎఫ్ మరియు జిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైళ్లలో మానవా మరియు చిన్నపిల్లల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల రవాణా, ఆపరేషన్ మహిళా సురక్ష, ఆపరేషన్ యాత్రి సురక్ష మొదలైన అంశాలు మరియు వాటికి సంబంధించిన కేసుల వివరాలను కార్యక్రమంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్పిఎఫ్ సిఐ వీరబాబు, జిఆర్పిఎఫ్ సిఐ అంజిబాబు, మరియు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.