గుంటూరులో ఉద్రిక్తత.. పోటా పోటీగా ఆందోళనలు

మెగా డీఎస్సీ అంశంపై గుంటూరులోని గుజ్జనగుండ్ల కూడలిలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. వైసీపీ నిర్వహించనున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమానికి ప్రతిస్పందనగా టీడీపీ నేతలు "వైసీపీ రాక్షస పాలన ముగింపుకు రెండేళ్లు" పేరుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒకేసారి రెండు పార్టీల కార్యక్రమాలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, పోలీసులు అప్రమత్తమై గుజ్జనగుండ్ల సెంటర్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్