మద్యం మత్తులో యువకుల హల్చల్

గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్‌లో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మరో యువకుడిపై దారుణంగా దాడి చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బహిరంగంగానే యువకులు రెచ్చిపోవడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో యువత పెడదారిన పడుతున్నారని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్