అన్నదాత సుఖీభవ, స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ మరియు నీటి వనరుల మరమ్మత్తు, పునరుద్ధరణ అంశాలపై వెలగపూడి సచివాలయం నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ విజయానంద్ సమీక్ష నిర్వహించారు. బంగారు కుటుంబాలను దత్తత చేసుకునే విషయంలో ఎవరినీ వత్తిడి చేయవద్దని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత ఇవ్వాలన్నారు. ఆగస్టు 15 కల్లా నిర్ణీత లక్ష్యాలను సాధించాలన్నారు.