ఉండవల్లిలో ద్విచక్ర వాహనాల చోరీలు కలకలం

తాడేపల్లి మండలం ఉండవల్లి ప్రాంతంలో ద్విచక్ర వాహనాల చోరీలు కలకలం రేపుతున్నాయి. పార్కింగ్ చేసిన స్కూటీలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు డిక్కీలు తెరిచి విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం సీఐ వీరేంద్ర సంఘటన స్థలాలను పరిశీలించి, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్