వేటపాలెం: తల్లిదండ్రులకు విద్యార్థుల పాదాభివందనాలు

వేటపాలెం మండలం కొత్తపేట జిల్లా పరిషత్ హైస్కూల్ లో గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. హెచ్ఎం గుమ్మ శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 250 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. వారికి వారి వారి పిల్లల చదువుల పురోగతి గురించి తెలియజేశారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. చివరగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్