గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే గ్రామ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల జనసేన అధ్యక్షులు కామిశెట్టి రమేష్, మాచవరం బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వంటరి హనుమంతరావు, ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు.