దాచేపల్లికి చెందిన వంటల అమరేశ్వరి ప్రతిభకు గుర్తింపుగా సి. వి. రామన్ అవార్డు అందుకున్నారు. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మంగళవారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన PTLPWO సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆమెకు అవార్డు అందజేశారు. ప్రస్తుతం అమరేశ్వరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నానోపౌడర్స్ ఆధారంగా డైస్ ఫోటోక్యాటలిటిక్ డిగ్రడేషన్ అంశంపై పీహెచ్‌డీ పరిశోధన కొనసాగిస్తున్నారు. ఆమె సాధనకు పలువురు అభినందనలు తెలిపారు.