వానరులను తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన కారు

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండల శివారులో బుధవారం కారు ప్రమాదానికి గురైంది. కారంపూడికి చెందిన కొందరు గుత్తికొండ బిలం వైపు వెళ్తుండగా, రోడ్డుపైకి వచ్చిన కోతులను తప్పించబోయి డ్రైవర్ కారును అదుపుతప్పడంతో అది నాగార్జునసాగర్ కుడికాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించి కారులోని వారిని బయటకు తీశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్