మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు ఖండన

వైసిపి మాజీమంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, పిడుగురాళ్ల కూటమి నాయకులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూటమి నాయకులు అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా అంబటి రాంబాబుకు సిగ్గు రాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్