బుధవారం దాచేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్ నాయక్ మృతి చెందారు. నరసరావుపేట నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాచేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. 'రక్షించాల్సిన రక్షకుడే రోడ్డు ప్రమాదంలో మరణించాడు' అని స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.