అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఆదివారం సాయంత్రం ఢీ కొట్టింది. తెలంగాణ వైపు నుంచి ఆంద్ర వైపు వేగంగా వచ్చి దాచేపల్లి పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొనగా, రోడ్డు దాటుతున్న గుండా. వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.