దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

దాచేపల్లి పట్టణంలోని పెట్రోల్ బంకు సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాచర్ల వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను హైస్పీడ్‌లో వస్తున్న లారీ ఢీకొట్టింది. పెట్రోల్ బంకు మలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం లారీ కింద పడిపోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ అధిక వేగంతో వెళ్తూ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్